అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

ఠాగూర్

శనివారం, 1 ఫిబ్రవరి 2025 (11:47 IST)
అఖాడా నుంచి మమతా బెనర్జీ, లక్ష్మీనారాయణ్‌ను బహిష్కరించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సినీ నటి మమతాకులకర్ణి సన్యాసాన్ని స్వీకరించిన విషయం తెల్సిందే. సన్యాస దీక్ష చేపట్టిన మమతాకు మహామండలేశ్వర్‌గా పట్టాభిషేకం చేశారు. 
 
అయితే మమతాను మహామండలేశ్వర్‌గా ప్రకటించడంపై మొదట్లోనే మరో మహామండలేశ్వర్‌ అయిన హేమాంగి సఖి అభ్యంతరం తెలిపారు. ఆమెకు ఆ హోదా పొందడానికి అర్హత లేదన్నారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని.. ఆమె గతమంతా అందరికీ తెలుసునన్నారు. డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం ప్రపంచమంతా తెలుసని గుర్తు చేశారు. 
 
జైలు నుంచి విడుదలయిన తర్వాత విదేశాల్లో గడిపిన ఆమె ఇప్పుడు ఇండియాకు వచ్చి సన్యాసం స్వీకరించడం వెనుక ఏదో కుట్ర ఉందని హేమాంగి సఖి అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా మహామండలేశ్వర్ పదవి నుంచి మమతా కులకర్ణిని కిన్నర్ అఖాడా తొలగించారు. మతపెద్దలు, అఖాడాల నుంచి అభ్యంతరాలు రావడం వల్లే.. ఆమెను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
మమతాను అఖాడాలో చేర్పించిన డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సైతం తొలగించారు. అఖాడాలో చేరిన మొదట్లోనే మహామండలేశ్వర్ హోదాను మమతాకు ఇవ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమైన కుంభమేళాలో కొందరు అసభ్యతని ప్రోత్సాహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మమతా, లక్ష్మీనారాయణ్‌లపై బహిష్కరణ వేటు పడిందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు