మహతో పాముని కొరికి కొరికి చంపడం గమనించి కొందరు గ్రామస్తులు షాక్ తిన్నారు. అలా చేయొద్దని అతడిని వారించారు. అయినా మహతో అస్సలు వినలేదు. తన పని తాను చేశాడు. ఆ తర్వాత, కనీసం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని గ్రామస్తులు బతిమిలానా పట్టించుకోలేదు. 'పాముని చంపేశాను కదా.. నాకేం కాదులే' అని చెప్పి వారి హెచ్చరికలు పెడచెవిన పెట్టాడు.
ఆ తర్వాత భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున కుటుంబసభ్యులు చూడగా మహతో స్పృహ తప్పి పడి పోయి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మహతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.