పెళ్లైన 24 గంటల్లోనే తలాక్ చెప్పేశాడు.. బైక్ కొనిపెట్టలేదట..

గురువారం, 18 జులై 2019 (13:57 IST)
అవును పెళ్లైన 24 గంటల్లోనే ఓ వ్యక్తి భార్యకు తలాక్ చెప్పేశాడు. పెళ్లిలో తనకు బైక్ పెట్టలేదన్న కారణంతో పెళ్లైన 24 గంటల్లోనే తలాక్ చెప్పేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగింది. కట్నం కింద తనకు బైక్ ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని భార్యతో పెళ్లైన గంటల్లోనే గొడవకు దిగాడు. ఇక బైక్ కొనివ్వలేదని తెలుసుకున్న ఆ వ్యక్తి  మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. 
 
దీంతో వధువు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కట్నం కింద అల్లుడు అడిగినవన్నీ ఇచ్చామని, బైక్ ఒక్కటీ ఇవ్వలేకపోయామని వధువు తండ్రి పోలీసులకు తెలిపాడు. ఇంకా వధువు తల్లిదండ్రులు వరుడు కుటుంబీకులపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు