కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

ఠాగూర్

శుక్రవారం, 27 డిశెంబరు 2024 (19:06 IST)
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. మన్మోహన్ ఇకలేరన్న వార్త యావత్ భారతావనిని విషాదంలో ముంచెత్తింది. ప్రస్తుతం మన్మోహన్ భౌతికకాయం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంది. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన పార్థివదేహంపై జాతీయ పతకాన్ని కప్పి వుంచారు. 
 
కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఆమె భారత్‌కు రావాల్సివుంది. ఆమె శనివారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోవచ్చని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఆ తర్వాతే ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
 
ఇక ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం తరలించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచి ఆ తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. 

 

ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

రేపు ఉదయం 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం

రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం

రేపు ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికకాయం

ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని పార్థీవదేహం… pic.twitter.com/Xswu3L3CKS

— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు