హర్యానా రాష్ట్రానికి చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017గా ఎన్నికైంది. దాదాపు 17యేళ్ళ తర్వాత భారత్‌కు చెందిన ఓ యువతి ఈ తరహా కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఒక్కసారి మానుషి పేరు దేశంలోనేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.
అదేసమయంలో ఆమె తీసుకునే ఆహారం, పాటించే ఆరోగ్య సూత్రాలు తదితర అంశాలపై నెటిజన్లు, మోడల్స్ శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మానుషికి ఫిట్నెస్, డైట్ ట్రైనర్లు ఉండేవారిని సంప్రదిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రతి రోజూ ఉదయం టిఫిన్ చేయడం అస్సలు విస్మరించకూడదు. దీనివలన ఆకలి పెరిగి పలు సమస్యలకు దారితీస్తుంది. అలాగే షుగర్, రిఫైండ్ షుగర్ వంటివి అస్సలు ముట్టుకోకూడదంట. ఉదయాన్నే రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్లెయిన్ యోగర్ట్ ఆమ్లెట్ లేదా వీట్ ఫ్లెక్స్‌తో పాటు తాజా పండ్లు, రెండు లేదా మూడు గుడ్లలోని తెల్ల సొన ఆహారంగా తీసుకోవాలి.
లంచ్‌లో అన్నం లేదా చపాతీతోపాటు ఒక కప్పు కూర లేదా చికెన్ లేదా పప్పు తీసుకోవాలి. సాయంత్రం ఉప్పు లేకుండా నట్స్, పండ్లు తీసుకోవాలి. డిన్నర్‌లో చికెన్ లేదా చేప(గ్రిల్డ్ లేదా రోస్టెడ్)తో పాటు బ్రకోలీ, క్యారెట్, బీన్స్, హష్రూమ్స్‌తోపాటు ఏదో ఒక కూర తీసుకోవాలి అని చెపుతున్నారు. ఈ తరహా ఆహార నియమాలను మానుషి చిల్లర్ పాటించినట్టు వారు వెల్లడించారు.