రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం: 22 మంది మృతి

ఐవీఆర్

శనివారం, 25 మే 2024 (22:31 IST)
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. వారిని గుర్తించడం కష్టంగా ఉంది అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వినాయక్ పటేల్ తెలిపారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి కృషి చేస్తోందని అన్నారు. మరోవైపు క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు.
 
అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. కాగా జోన్ లోపల మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాక మృతుల సంఖ్య ఎంతన్నది చెప్పే అవకాశం వుంటుందని సంబంధిత అధికారి చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటో పరిశీలించగలమని అన్నారు. నగరంలోని అన్ని గేమింగ్ జోన్‌లను మూసివేయమని ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలియజేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు