అదీ కేవలం ఐదు నెలల్లోనే రాహుల్ గాంధీ రూ.46.49 లక్షల్ని స్టాక్ మార్కెట్ ద్వారా రాహుల్ గాంధీ ఆర్జించినట్లు తెలుస్తోంది. ఈ పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు రూ. 4.33 కోట్ల నుంచి (ఎన్నికల అఫిడవిట్ ద్వారా వెల్లడైన మార్చి 15, 2024 నాటికి) దాదాపు రూ. 4.80 కోట్లకు (ఆగస్టు 12, 2024 నాటికి) పెరిగిందని తాజా నివేదిక పేర్కొంది.
రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, దివిస్ ల్యాబ్స్, జీఎంఎం, హిందూస్థాన్ యునిలిర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, ట్యూబ్ స్టాక్స్ షేర్లు బాగా పెరిగాయని తాజా నివేదిక వెల్లడించింది.