మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న: మోదీ ప్రకటన

సెల్వి

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (14:59 IST)
PV Narasimha Rao
మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్‌సింగ్‌లతో పాటు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌లకు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 
 
సోషల్ మీడియా పోస్ట్‌లో, పివి నరసింహారావు గారిని సత్కరించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించడం వారి ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ ప్రకటన భారతదేశ చరిత్రలో వారి స్థానాన్ని సుస్థిరం చేస్తుందని చెప్పారు.
 
ఉమ్మడి ఏపీ కరీంనగర్‌లో పుట్టి పెరిగిన పీవీ నరసింహారువు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు పలు కేంద్ర మంత్రి పదవుల్ని చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు