మతం పేరుతో దాడిచేస్తే ఆ మతానికే కీడు కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలిసి ఆయన "ఇస్లామిక్ వారసత్వం : అవగాహన, సంయమనాల ప్రోత్సాహం" అనే అంశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, మతం పేరుతో మానవాళిపై దాడి చేసేవారు నిజానికి ఆ మతానికే కీడు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. మతం పేరుతో మానవాళిపై దాడి చేసేవారు, తమ దాడుల వల్ల అతి పెద్ద బాధితురాలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న మతమేనని అర్థం చేసుకోవడం లేదన్నారు.
ఆ తర్వాత రాజు అబ్దుల్లా -2 మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాడటమంటే ముస్లింలకు వ్యతిరేకంగానో, మరో మతంపైనో పోరాటం కాదన్నారు. ఇది విద్వేషంపై పోరాటమని స్పష్టంచేశారు. మతమంటే మానవాళిని కలిపి ఉంచేదని అందరూ భావిస్తారన్నారు.