ఇంటి నుంచి పారిపోయిన 18 ఏళ్ల యువతి.. ఓ దుర్మార్గుడి చేతికి చిక్కింది. అత్యాచారానికి గురైంది. ఇంట్లో గొడవపడి అలిగి ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆ యువతి కామాంధుడికి బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 17వ తేదీన పంజాబ్‌లోని తన ఇంట్లో నుంచి పారిపోయింది. అలా వెళ్లిపోతూ... ఇంట్లో బీరువాలో ఉన్న రూ.10వేలను పట్టుకుపోయింది. తిన్నగా అమృత్‌సర్ వెళ్లింది.
అలా గుజరాత్, రాజస్థాన్ తిరిగింది. చివరికి నవంబర్ 9వ తేదీన ముంబై సెంట్రల్‌కి వెళ్లింది. రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉన్న ఆమెను ఎవరికి వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోసాగారు. ఆ సమయంలో అక్తర్ రియాజుద్దీన్ ఖురేషీ కళ్లు ఆమెపై పడ్డాయి. చేతిలో వాటర్ బాటిల్‌తో వెళ్లి ఆమె కూర్చున్న బెంచీలో మరోవైపు కూర్చున్నాడు. సమస్యేంటి? ఎందుకు ఏడుస్తున్నారు? అంటూ వాటర్ బాటిల్ ఇచ్చి హీరోలా బిల్డప్ ఇచ్చాడు. బడబడా ఏడ్చేసింది. తర్వాత కోలుకొని అతనికి మేటర్ మొత్తం చెప్పేసింది. దీంతో మాటలతో నమ్మించి.. కామాతిపురంకు తీసుకెళ్లాడు.
అక్కడో గదికి తీసుకెళ్లి.. బిర్యానీ తెచ్చాడు. ఆపై మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె ప్రతిఘటించినా నోరు గట్టిగా నొక్కేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై కామాతిపురంలో ప్రాస్టిట్యూషన్ కామన్ కావడంతో... ఆమె ఆర్తనాదాలు... ఎవరికీ వినిపించలేదు. అక్కడ నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఆస్పత్రికి పంపిన పోలీసులు.. ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు.