పెళ్ళి పేరుతో కామవాంఛ తీర్చుకున్న బడా పారిశ్రామికవేత్త!

ఆదివారం, 7 మార్చి 2021 (10:46 IST)
ఇటీవలి కాలంలో పెళ్లిపేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా, అనేక మంది బడా వ్యక్తులు అమ్మాయిలతో కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ బడా పారిశ్రామికవేత్త ఓ యువతిని పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ముంబైలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరానికి చెందిన 25 సంవత్సరాలు కలిగిన ఓ యువతి నివాసముంటోంది. అయితే ఆమె స్వగ్రామం వేరే అయినప్పటికీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ముంబైలో ఉంటోంది.
 
ఈ క్రమంలో పలు హిందీ, మరాఠీ ధారావాహికలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. అయితే ధారావాహికల షూటింగులకు హాజరవుతున్న సమయంలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో పరిచయం ఏర్పడింది.
 
దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడు కలిసి బయటికి వెళ్లడం, డిన్నర్లు, పార్టీలకు వెళ్లడం వంటి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వ్యాపార వేత్త సీరియల్ నటికి లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా ఆమె అతడి ప్రేమని అంగీకరించింది. దీంతో పెళ్లికి ముందే హద్దులుదాటింది. 
 
ఈ మధ్య సీరియల్ నటి తనని పెళ్లి చేసుకోమని తన ప్రియుడిని కోరడంతో ఏదో ఒక వంక చెబుతూ పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. దీంతో తాజాగా మరోమారు నటి తన ప్రియుడిని గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని చెప్పేశాడట. దీంతో మోసపోయానని గ్రహించిన సీరియల్ నటి వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులను సంప్రదించి తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు