వివరాల్లోకి వెళితే ముంబైలోని చండీవాలిలో నహరే అమృత్ శక్తి నివాస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రేష్మా ట్రెంచిల్ అనే మహిళ భర్త శరత్ కరోనా సోకి చికిత్స పొందుతూ మే 23న మరణించాడు. ఆమె భర్త వ్యవసాయ కోసం ఉపయోగించే పనిముట్లను ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. తనను కొడుకుని ఎంతో అపురూపంగా చూసుకునే భర్త తలచుకుని ట్రెంచిల్ కుమిలిపోయింది. ఆ బాధనుంచి తేరుకోలేకపోతోంది.
పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను వేధిస్తున్నారనీ.. ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని..వారి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.