కొడుకుతో పాటు 12 అంతస్తుల భవనం నుంచి దూకిన మహిళ!

బుధవారం, 23 జూన్ 2021 (14:36 IST)
ఓ మహిళ తన బిడ్డతో సహా 12 అంతస్తు భవనం నుంచి కిందకి దూకేసింది. పొరుగింటివారు నీ కొడుకు అల్లరోడు.. భరించలేకపోతున్నాం అంటూ వేధించడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
తాజాగా ముంబైకు చెందిన రేష్మ ట్రెంచిల్ (44) అనే మహిళకు భర్త శరత్ మూలుకుట్ల కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె తన ఏడేళ్ళ కుమారుడితో కలిసి తన ఇంట్లో ఉంటూ వచ్చింది. ఒకవైపు భర్త పోయిన బాధలో ఆమె వుండగా, పొరుగింటివారు.. ‘నీ కొడుకు అల్లరోడు.. భరించలేకపోతున్నాం’ అంటూ వేధించసాగారు. 
 
ఈ వేధింపులు భరించలేక ఇప్పుడు ఏడేళ్ల కుమారుడు సహా ఆమె ఆత్మహత్య చేసుకుంది. 12వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో ఆమె ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు 33 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మే 23న భర్త చనిపోగా, అప్పటి నుంచి రేష్మ చాందివిలీలోని తన ఫ్లాట్ లో ఏడేళ్ల కుమారుడితో ఉంటోంది. 
 
అయితే, వారి కొడుకు చాలా అల్లరివాడని, కొంటె పనులు ఎక్కువగా చేస్తున్నాడని పొరుగున ఉన్న ఆయూబ్ ఖాన్ (67), అరవై ఏళ్ల అతడి భార్య, అతడి కొడుకు షాదాబ్‌లు వేధించడం మొదలుపెట్టారు. 
 
అప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న ఆమె.. వారి వేధింపులతో మరింత కుంగిపోయారు. తమ అపార్ట్‌మెంట్‌పై నుంచే దూకి ప్రాణం తీసుకున్నారు. కాగా భర్త కంటే ముందే అత్తమామలు కూడా కరోనా వైరస్ సోకి చనిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు