Anupam Kher, Dulari Khair, Raju Khair, Falguni
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార ఛాప్టర్ 1 చిత్రం విడుదలై యూనివర్శల్ గా మంచి కలెక్లన్లతో రన్ అవుతుంది. మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 235 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టిందని చిత్ర టీమ్ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన తల్లి దులారీ ఖైర్, సోదరుడు రాజు ఖైర్, ఫల్గుణి, ఇతర సభ్యులతో ముంబైలో సినిమాను తిలకించారు.