కాంగ్రెస్‍‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్నారు : రాహుల్ గాంధీ

ఠాగూర్

శనివారం, 8 మార్చి 2025 (15:50 IST)
తమ సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ఉంటూ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని తక్షణం గుర్తంచాలని ఆయన ఆదేశించారు. మన బాధ్యతను నెరవేర్చేంత వరకు అధికారం ఇవ్వమని గుజరాత్ ప్రజలను అడకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పార్టీ కార్యర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 
 
తమ పార్టీ బాధ్యతలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు తమకు (కాంగ్రెస్) ఓటు వేయమని అడగరాదని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ అందించిన పాలన విఫలమైందన్నారు. గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం వేచి చూస్తున్నారని అన్నారు. ఆశించిన విధంగా రాష్ట్ర ప్రగతి సాధించడం లేదని, కాంగ్రెస్ కూడా అందుకు సరైన మార్గాన్ని చూపించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గుజరాత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో రెండు రకాలుగా ఉన్నారు. నిజాయితీగా పనిచేస్తూ ప్రజలను గౌరవిస్తూ వారి కోసం పోరాడుతూ పార్టీ సిద్దాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకునేవారు ఒకరు. రెండో రకానికి వస్తే ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారికి దూరంగా ఉండటమే కాకుండా, గౌరవం కూడా ఇవ్వరు. ఇందులో సగం మంది భారతీయ జనతా పార్టీతో టచ్‌లో ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు