న్యూయార్క్‌లో నయన-విఘ్నేశ్.. ఏం చేస్తున్నారో తెలుసా? ఫోటో చూడండి

మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (14:10 IST)
శింబు, ప్రభుదేవాలకు కటీఫ్ ఇచ్చిన అందాల రాశి నయనతార ప్రస్తుతం డైరక్టర్ విఘ్నేశ్ శివన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ప్రభుదేవాను వివాహం చేసుకుంటుందని అందరూ అనుకున్న సమయంలో ఆయనకు దూరమై ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నయనతార ప్రస్తుతం విఘ్నేశ్ శివన్‌తో క్లోజ్ అయ్యింది. విఘ్నేశ్‌తో ఆమె చాలా క్లోజ్‌గా వున్న విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. 
 
బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్‌తో తాను న్యూయార్క్‌లో ఉన్న‌ట్లు న‌య‌న‌తారా తాజాగా ట్వీట్ చేసింది. దీంతో వాళ్ల ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం బలంగా వున్నట్లు తేలిపోయింది. విఘ్నేశ్ బర్త్ డేను పురస్కరించుకుని.. ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు నయన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇటీవల నయనతారతో తనకున్న వ్యక్తిగత సంబంధాలను గురించి చెప్పలేనని.. అలాంటి అంశాలను చెప్పేందుకు తనకు ఇబ్బందిగా వుంటుందని విఘ్నేశ్ అన్నాడు. 
 
అయితే వీరిద్దరూ విదేశాల్లో ట్రిప్పేసి ఆ ఫోటోలను పోస్టు చేయడాన్ని బట్టి చూస్తే.. వీరిద్దరి సంబంధాలు చాలా బలంగానే వున్నాయని తెలుస్తోంది. కాగా విఘ్నేష్, నయన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు