oyorooms ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో OYO పెళ్లికాని జంటలకు షాకిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై పెళ్లికాని జంటలకు ఓయో గదులను అద్దెకి ఇవ్వబోమని ఒక ప్రకటనలో కంపెనీ ఆదివారం నాడు వెల్లడించింది. సవరించిన పాలసీ ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వరు. ఒకవేళ గదిని బుక్ చేసుకోవాలంటే జంటకు సంబంధించిన పెళ్లిని నిర్థారించే ఐడి ప్రూఫ్ చూపించాల్సి వుంటుంది.
తమ హోటల్స్‌లో చెక్-ఇన్ అయ్యేవారి విషయంలో విద్యార్థులు, కుటుంబాలు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులను అందించే బ్రాండుగా నిలవాలన్న యోచనలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెళ్లి ధృవీకరణకు ఎలాంటి పత్రం సమర్పించాలన్నది మాత్రం స్పష్టీకరించలేదు.