దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ లాక్డౌన్‌లోకి వెళ్లనుంది. అయితే, ఈ దఫా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్‌ను అమలు చేయడంలేదు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కోరల నుంచి ప్రజలను కాపాడేందుకు లాక్డౌన్ విధించనున్నారు. వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తారు. అలాగే, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, స్కూళ్లకు సెలవులు, నిర్మాణ పనుల నిలిపివేత వంటివి తీసుకున్నారు.
ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. లాక్డౌన్‌పై కూడా ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ చర్యల వల్ల వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గే అవకాశం ఉండటంతో ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని చీఫ్ జస్టిస్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.