కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయా(ఆర్టీవో)ల్లో టెస్ట్ డ్రైవింగ్ అక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే, అధీకృత డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పూర్తిచేసుకుని, సర్టిఫికెట్ పొందితే చాలని తెలిపింది.
డ్రైవింగ్ స్కూల్‌లో నిర్వహించే టెస్టు వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించి, శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. వాటిని ఆర్టీయే కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తుతో జతచేస్తే సరిపోతుంది. ఎలాంటి టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుందని పేర్కొంది.