వీరిలో కొందరు కరోనా బారినపడడంతో మరికొందరిని ముందు జాగ్రత్తగా అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో తబ్లిగీ సభ్యులు నర్సులు, ఇతర వైద్యసిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు.
వైద్యసిబ్బందిపై దాడి చేసినవాళ్లను "మానవాళికి శత్రువులు"గా అభివర్ణించారు. వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. "వారు చట్టాన్ని గౌరవించరు, ప్రభుత్వ ఆదేశాలను అంతకన్నా పాటించరు. ఇలాంటివాళ్లతో మనుషులకు ముప్పు ఉంటుంది. మహిళా వైద్య సిబ్బందిపై వారు దాడికి పాల్పడడం తీవ్ర నేరం. వారిని వదిలిపెట్టేది లేదు" అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.