అయితే ఈ ఎన్నికల ఫలితాలు తప్పకుండా అన్నాడీఎంకే ఏర్పడిన చీలికను మళ్లీ కలుపుతాయని.. కొద్ది రోజుల క్రితం అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి దినకరన్ అన్నారు. తాజాగా ఓపీఎస్ కూడా ఆర్కేనగర్ ఉప ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేలోని వర్గాలన్నీ ఏకం అవుతాయని.. రెండు వర్గాలు ఒక్కటైపోతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలో రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఓపీఎస్ స్పష్టం చేశారు.