నల్ల కుబేరుల గుండెల్లో గుబులు డిపాజిట్‌లపై పరిమితి.. రూ.5వేలకు పైబడితే?

సోమవారం, 19 డిశెంబరు 2016 (13:57 IST)
నల్లధనంపై యుద్ధంలో భాగంగా పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సహకార బ్యాంకులపై ఆధారపడి గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో నల్లధనాన్ని ఇతరుల ఖాతాల్లో డిపాజిట్‌ చేయించి తెల్లధనంగా మార్చుకోవాలని చూస్తున్న వారికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఇప్పటివరకు రోజువారీ డిపాజిట్లపై పరిమితి విధించని కేంద్రం.. తాజా నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇందులో భాగంగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై కేంద్రం పరిమితి విధించింది. డిసెంబర్‌ 30లోగా రూ.5వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్‌ చేసుకునేలా తాజాగా ఆదేశాలు జారీచేసింది.

వెబ్దునియా పై చదవండి