ఆ రాష్ట్రంలో ఆన్‍‌లైన్ వివాహాలకు చట్టబద్ధత - కేరళ కోర్టు అనుమతి

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (09:11 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా పలు కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేరళ కోర్టు ఆన్‌లైన్ పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన మహిళా న్యాయవాది రింటు థామస్ (25), అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి వివాహం గురువారం జరగాల్సివుంది. కానీ ఒమిక్రాన్ రూపంలో ఈ పెళ్లికి ఆటంకం ఏర్పడింది. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నాయర్ బుధవారం స్వదేశానికి రావాల్సి వుండగా, ఒమిక్రాన్ ఆంక్షలు అమల్లో ఉండటంతో అతను రాలేక పోయారు. 
 
దీంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకునేందుకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్‌రిజిస్ట్రార్‌లను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఎన్.నగరేశ్ ఆమె వినితిని అంగీకరించారు.
 
కరోనా సమయంలో ఆన్‌లైన్ వివాహాలకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇపుడు కూడా దానిని అమలు చేయవచ్చని, అందువల్ల రింటు థామస్ పెళ్లికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు