కదిలే రైలులో ఎక్కడం, దిగడం కూడదని.. ప్రకటనలు చేస్తున్నా.. త్వరగా వెళ్లాలనే ఆత్రుత చాలామంది కదిలే రైలు ఎక్కుతుంటారు. ఆపై ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా త్వరగా వెళ్లాలనే ఆతృత ఓ ప్రయాణీకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కానీ ఆర్పీఎఫ్ పోలీస్ ధైర్యంగా ముందుకొచ్చి ఆ ప్రయాణీకుడి ప్రాణాలు కాపాడాడు.
మరోవైపు.. 30 ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం ముంబై కల్యాణ్ రైల్వేస్టేషన్‌లో ప్రసవించింది. రైలులో ప్రయాణీస్తున్న గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ రైల్వే మెడికల్ స్టాఫ్ సాయంతో చికిత్స చేయించారు. ఈ సందర్భంగా ప్రయాణీకురాలు కవల పిల్లలకు తల్లి అయ్యింది. రైలులోనే ప్రసవం కావడంతో మెరుగైన చికిత్స కోసం రుక్మిణీభాయ్ ఆస్పత్రికి తరలించారు.