ఒకే దేశం - ఒకే ఎన్నిక (వన్ నేషన్ - వన్ ఎలక్షన్)పై కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లును తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. ఇంతలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.
కాగా, ఈ బిల్లులను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది. అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది. అంతలోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.