అన్నాడీఎంకే పగ్గాలు శశికళ వర్గీయుల చేతికి పోవడంతో మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని మంటగలిపేందుకు శశివర్గీయులు ప్లాన్ చేస్తున్నారని.. అధికారంలో ఉన్నంతకాలం బాగా డబ్బు దోచుకునేందుకు రంగ సిద్ధం చేస్తున్నారని శశికళ వర్గీయులపై ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18వ తేదీన అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
విశ్వాస తీర్మానంలో ఆ రోజు పళనిస్వామి బలం నిరూపించుకున్నారు. కానీ ఆ రోజు సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ జరిగిన తీరు సరిగా లేదని, బలవంతంగా విపక్షాలను బయటకు పంపించి విశ్వాస తీర్మానంలో నెగ్గారనే ఆరోపణలనున్నాయి. దీనిపై సుప్రీంను ఆశ్రయించాలని ఓపీఎస్ రెడీ అయిపోయారు. ఈ విధంగా శశికళ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు.