ప్రవర్తనా నియమావళి కమిటీ నివేదికపై చర్చించాలని, మహువా మోయిత్రా తన వాదనను సమర్పించాలనే డిమాండ్‌ను లోక్‌సభ స్పీకర్ తిరస్కరించారు. కమిటీ ముందు తన పక్షాన్ని వినిపించేందుకు మొయిత్రాకు అవకాశం లభించిందని చైర్మన్ తెలిపారు.
డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మొయిత్రాపై చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా మొయిత్రా మాట్లాడుతూ.. "నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు ప్రవర్తనా నియమావళి కమిటీకి లేదు. అదానీని కాపాడేందుకు ప్రభుత్వం ఏమైనా చేయగలదని తేలింది. నాకు ఇప్పుడు 49 ఏళ్లు. వచ్చే 30 ఏళ్ల పాటు పార్లమెంటు వెలుపలా, లోపలా పోరాడుతూనే ఉంటాను" అని మోయిత్రా ధీమా వ్యక్తం చేశారు.