భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?

సెల్వి

సోమవారం, 12 మే 2025 (16:29 IST)
పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ, భారత జర్నలిస్టులు, పౌరులను సంప్రదించి, కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం కోరుతున్నట్లు సమాచారం. భారత అధికారులు హెచ్చరిక జారీ చేసింది. 7340921702 అనే భారతీయ నెంబర్ నుండి వస్తున్న అటువంటి కాల్స్‌కు స్పందించవద్దని పౌరులను హెచ్చరించారు.
 
ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు, ప్రస్తుత పరిస్థితిపై సమాచారం పొందడానికి జర్నలిస్టులు, పౌరులకు కాల్ చేయడానికి పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ భారతీయ వాట్సాప్ నంబర్: 7340921702ను ఉపయోగిస్తున్నాయి. దయచేసి అలాంటి ప్రయత్నాలకు పాల్పడకండని భారత అధికారులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
 
ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. "ఈ సున్నితమైన సమయాల్లో, వాట్సాప్‌లో చాలా తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని ప్రామాణిక సమాచారం కోసం మా వాట్సాప్ ఛానెల్‌ను అనుసరించండి." అంటూ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు