సీన్ రివర్స్.. వరకట్నం వేధింపులు.. అత్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు

శనివారం, 6 జూన్ 2020 (13:35 IST)
తమిళనాడు పుదుక్కోట్టైలో దారుణం చోటుచేసుకుంది. వరకట్నం కోసం వేధింపులతో ఎందరో కోడళ్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గురించి వినివుంటాం. కానీ పుదుక్కోటైలో సీన్ రివర్స్ అయ్యింది. వరకట్నం కోసం హింసకు గురిచేసిన అత్తగారిని కోడలు కిరోసిన్ పోసి నిప్పంటించింది.

వివరాల్లోకి వెళితే.. పుదుక్కోట్టై జిల్లా, మణియం పల్లంకు చెందిన రాజమ్మాల్ కుమారుడు రమేష్‌కు ప్రతిభ అనే యువతిలో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల పాప వుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమ్మాళ్, ప్రతిభల మధ్య తగాదాలు చోటుచేసుకునేవి. ఇలా కూలీకి వెళ్ళొచ్చిన రాజమ్మాళ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెపై ప్రతిభ కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజమ్మాళ్ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతిభను అరెస్ట్ చేశారు. విచారణలో తన అత్తగారు వరకట్నం కోసం రోజూ వేధించేదని.. గృహ హింసను తాళలేక ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించానని అంగీకరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు