లోక్‌సభ, రాజ్యసభ ప్రధాన సభావేదికలతోపాటు గ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు ఏర్పాటుచేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 23న నిరవధికంగా వాయిదాపడ్డాయి. రాజ్యాంగం ప్రకారం రెండు సమావేశాలకు మధ్య విరామం 6 నెలలు మించవద్దు. అంటే సెప్టెంబర్ 23లోగా సమావేశాలు నిర్వహించాలి.
ప్రధాని మోదీ, మంత్రులు, సభా నాయకులు, ప్రతిపక్ష సభ్యులకు రాజ్యసభలో ప్రధాన మందిరంలో సీట్లు కేటాయిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభా మందిరాల్లో 82 ఇంచుల వెడల్పయిన రెండు భారీ డిజిటల్ తెరలను ఏర్పాటుచేస్తున్నారు. నాలుగు గ్యాలరీల్లో 40 ఇంచుల తెరలను పెడుతున్నారు.