ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చాం.. కానీ మోదీ సర్కారు?: మన్మోహన్

మంగళవారం, 24 జులై 2018 (17:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రధాన మంత్రి హోదాలో తాను హామీ ఇచ్చానని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. తామిచ్చిన హామీలను తర్వాతి సర్కారు అమలు చేయలేదని.. తద్వారా హోదా హామీ నీరుగారిపోయిందని చెప్పారు. అయినా నాడు పార్లమెంట్ లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  
 
సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లా విడిపోవాలని తమ పార్టీ కోరుకుందని, నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి పదేళ్ల హోదా కావాలని నాడు అరుణ్ జైట్లీ అన్నారని, నేడు ఆర్థిక మంత్రి కాగానే ఆ విషయం మర్చిపోయారని, 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతున్నారని దుయ్యబట్టారు.
 
సీపీఎం ఎంపీ రంగరాజన్ మాట్లాడుతూ, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని, చెన్నైలో 25 శాతం మంది తెలుగువాళ్లు ఉన్నారని, ఏపీ కష్టాలు తమకు తెలుసునని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు