ఇందులో ఆయన ఎన్డీయే కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఆదుకున్నాయన్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక తుఫానులా మారి తమ కూటమికి పునర్జీవం కల్పించారని ఆయన అన్నారు.
ముఖ్యంగా, దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారు.
ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం 'అవసరం. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలి. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానం. అన్ని అంశాల్లో ఏకగ్రీవ నిర్ణయాలే లక్ష్యం అని మోదీ అన్నారు. ఇక ఎన్డీయే అంటే 'న్యూ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా' అని కొత్త అర్థం చెప్పారు.