పెన్‌డ్రైవ్‌లో ప్రైవేట్ ఫోటోలు.. ఐదు లక్షల డిమాండ్.. బ్లాక్ మెయిల్.. ఎక్కడ?

శనివారం, 30 జనవరి 2021 (19:39 IST)
మధ్యప్రదేశ్‌కి చెందిన యువతిని పెన్‌డ్రైవ్‌తో బ్లాక్ మెయిల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ యువతి ఇటీవల స్నేహితులతో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లిన సమయంలో తన పెన్‌డ్రైవ్‌ను పోగొట్టుకుంది. అయితే ఆ పెన్‌డ్రైవ్ ఓ ఆకతాయి చేతికి చిక్కడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. 
 
తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే... ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న ప్రైవేట్ ఫోటోలు బయటపెడుతానని అతను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకే కాదు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు కూడా ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. 
 
అతని వేధింపులను తాళలేక ఇద్దరూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. భోపాల్‌కి చెందిన ఓ లా స్టూడెంట్(21),ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఇటీవల తమ సహచర లా స్టూడెంట్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొస్తున్న క్రమంలో పెన్ డ్రైవ్‌ను హోటల్‌లో మరిచి వెళ్లిపోయారు. కట్ చేస్తే... ఈ నెల 15న ఆమెకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
 
ఆమె పెన్‌డ్రైవ్ తన వద్ద ఉందని చెప్పిన ఆ గుర్తు తెలియని వ్యక్తి... రూ.5లక్షలు డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో అందులో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న కొన్ని స్క్రీన్‌షాట్స్‌లో అతను ఆమె ఫోన్ నంబర్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకే కాదు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు కూడా ఫోన్ చేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు.
 
రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవుతుండటంతో ఇద్దరూ భోపాల్‌లోని బాగ్ సెవానియా పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీ తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు