పెట్రోల్ భారాన్ని తగ్గించిన మమతా బెనర్జీ...

ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (17:53 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, టీఎంసీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అర్థరాత్రి నుంచి తగ్గించిన ధరలు అమలవుతాయని ఆదివారం వెల్లడించారు. 
 
ఆదివారం రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఒక్క రూపాయి తగ్గిస్తున్నట్టు తెలిపారు. బెంగాల్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఒక రూపాయి ట్యాక్స్‌ను తగ్గించినట్లు తెలిపారు. 
 
'కేంద్ర పెట్రోల్‌పై ట్యాక్స్‌ల రూపంలో రూ.32.90 తీసుకుంటోంది. కానీ రాష్ట్రాలకు కేవలం రూ.18.46 మాత్రమే లభిస్తోంది. అలాగే డీజిల్‌పై రూ.31.80 పైసలు ట్యాక్స్ వసూలు చేస్తోంది. కానీ రాష్ట్రాలకు మాత్రం రూ.12.77 మాత్రమే అందుతోంది. అయినప్పటికీ ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించేందుకు నిర్ణయించిందని' అని అమిత్ మిత్రా వెల్లడించారు.

కాగా, దేశంలో గత 12 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఈ ధరల పెరుగందలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు