నిద్రలోకి జారుకున్న చంద్రయాన్ 3..

బుధవారం, 6 సెప్టెంబరు 2023 (12:58 IST)
Chandrayaan 3
చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం. 
 
విక్రమ్ ల్యాండర్‌ స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా ఈ ఉదయం 8 గంటలకు సమయాన్ని సెట్ చేసింది ఇస్రో. సౌర విద్యుత్ ఆధారంగా పని చేసే బ్యాటరీని ఇందులో అమర్చారు శాస్త్రవేత్తలు.
 
బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత వరకూ యాక్టివ్ మోడల్‌లోనే ఉండే ప్రజ్ఞాన్ రోవర్.. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. 
 
తాజాగా ఇస్రో విడుదల చేసిన ఈ ఫొటోలు ఎరుపు, నీలం, ఆకుపచ్చ మిశ్రమంలో కనిపిస్తోన్నాయి. ఈ ఫొటోలను స్టీరియో ఎఫెక్ట్‌లోకి మార్చింది ఇస్రో.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు