అక్కడ ఆ పని చేస్తే రైల్వే టిక్కెట్ ఫ్రీ

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (16:28 IST)
సాధారణంగా రైల్వే టిక్కెట్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. కానీ, ఢిల్లీలోని ఆనద్ విహార్ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఉచితంగా రైలు ప్రయాణ టిక్కెట్ ఇస్తారు. అయితే, ఆ ఒక్క పని చేయాల్సివుంటుంది. అందేంటంటో... గుంజీలు తీయాల్సి ఉంటుంది. 
 
సాధారణంగా రైల్వే స్టేషన్‌లో చెత్తచెందారం నిండివుంటుంది. లేదా బరువును కొలిచే వేయింగ్ మిషన్ ఉంటుంది. కానీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఫిట్నెస్ యంత్రం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్‌లో ఫిట్నెస్ మెషీన్ ఏర్పాటు చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ యంత్రం ఏర్పాటు వెనుక బలమైన కారణముంది. ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే రైల్వే శాఖ ముఖ్యోద్దేశం. 
 
ఇక అసలు విషయానికొస్తే, ఎవరైనా ఆ ఫిట్నెస్ మెషీన్ వద్దకు వచ్చి కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అందులోంచి ఓ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా మీ చేతికి వస్తుంది. రష్యాలలో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. కాగా, దీనిపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఫిట్నెస్‌తో పాటు పొదుపు కూడా సాధ్యం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు.

 

फिटनेस के साथ बचत भी: दिल्ली के आनंद विहार रेलवे स्टेशन पर फिटनेस को प्रोत्साहित करने के लिए अनूठा प्रयोग किया गया है।

यहां लगाई गई मशीन के सामने एक्सरसाइज करने पर प्लेटफार्म टिकट निशुल्क लिया जा सकता है। pic.twitter.com/RL79nKEJBp

— Piyush Goyal (@PiyushGoyal) February 21, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు