నేడు బుద్ధ పూర్ణిమ.. జాతినుద్దేశించి ప్రధాని ప్రత్యేక సందేశం

గురువారం, 7 మే 2020 (11:18 IST)
ప్రపంచవ్యాప్తంగా గురువారం బుద్ధ పూర్ణిమను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా వైరస్ బాధితులు, కరోనా యోధులను ఉద్దేశించి ప్రస్తావించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధమత ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. బుద్ధుని జయంతి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలను 'వేసక్​'గా కూడా వ్యవహరిస్తారు.
 
బుద్ధ జయంతి సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బుద్ధిస్ట్ సమాఖ్య సంయుక్తంగా.. ఈ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ మత ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. 
 
బుద్ధుని జీవితంలో ముఖ్యస్థలాలుగా పేరుగాంచిన లుంబీనీ పార్క్ (నేపాల్), మహాబోధి ఆలయం(బోధ్​గయ, భారత్), ముల్గనంద కుటి విహారా.. సారనాథ్, పరినిర్వాణ స్తూప.. కుషినగర్, సహా శ్రీలంక, నేపాల్​లోని ఆయా ప్రాంతాల నుంచి లైవ్ కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు. 
 
వేసక్ బుద్ధ పూర్ణిమ వేడుకలను మూడు దీవెనల రోజుగా బౌద్ధమతంలో వ్యవహరిస్తారు. ఈ రోజే బుద్ధుని జననం, జ్ఞానోదయం, మహా పరినిర్వాణగా పిలిచే మరణం సంభవించాయని బౌద్ధుల విశ్వాసం. బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు