మన మహిళలో సిందూరం తుడిసివేసిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ బేస్ ఉన్నతాధికారులు, సైనికులతో ఆయన ముచ్చటించారు. ఆ తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతాకీ జై అనే నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు.
మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే. అణు బెదిరింపులను అపహాస్యం చేసింది. భారత శక్తి సామర్థ్యాలను చూసి నా జీవితం ధన్యమైంది. యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశాం. ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మార్మోగుతోంది. ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ సెల్యూట్ చేస్తున్నా.. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నిదానం ప్రపంచమంతా మార్మోగుతోంది.