వందే భారత్ రైలు: 10 కొత్త వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చ జెండా

ఐవీఆర్

మంగళవారం, 12 మార్చి 2024 (18:49 IST)
కర్టెసి-ట్విట్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 12, మంగళవారం నాడు 10 కొత్త వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దీనితో వందేభారత్ రైళ్ల సంఖ్య 50కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 45 మార్గాలను కవర్ చేస్తూ ఈ రైళ్లు నడవనున్నాయి. ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, విశాఖపట్నం-సికింద్రాబాద్ సహా ఆరు రూట్లలో రెండు వందేభారత్ రైళ్లు నడుస్తాయి.
 
కొత్త వందే భారత్ రైళ్ల మార్గాలు ఇవే
అహ్మదాబాద్-ముంబై సెంట్రల్
సికింద్రాబాద్-విశాఖపట్నం
మైసూరు- డా. MGR సెంట్రల్ (చెన్నై)
పాట్నా- లక్నో
కొత్త జల్పైగురి-పాట్నా
పూరి-విశాఖపట్నం
లక్నో- డెహ్రాడూన్
కలబురగి - సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
రాంచీ-వారణాసి
ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)
 
తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైలు నంబర్ 20707 (సికింద్రాబాద్-విశాఖపట్నం) సికింద్రాబాద్ నుండి ఉదయం 05:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు నంబర్ 20708 (విశాఖపట్నం-సికింద్రాబాద్) మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు గురువారాలు మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

Hon’ble PM Shri @narendramodi ji flagged off 10 Vande Bharat Trains and dedicated and laid the foundation stone for Railway infrastructure projects worth over ₹85,000 Crores.#vandebharatexpress #ModiSarkarKiGuarantee #RailInfra4Bharat pic.twitter.com/cawmI0OLN4

— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు