దేశంలో భానుడు భగభగమంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ నెల 13, 14 తేదీల్లో జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉరుములతో కూడిన వర్షాలు, హిమపాతం కురుస్తుందని.. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఈ నెల 13న, అంటే బుధవారం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వేడి వాతావరణమే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.