రజనీకాంత్ 71వ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ

శనివారం, 12 డిశెంబరు 2020 (13:03 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినోత్సవాలను ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. అలాగే నేడు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ కు కూడా మోడి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
 
ఇకపోతే.. ఇప్పటికే తన రాజకీయ పార్టీ పేరును రజనీకాంత్ రిజిస్ట్రేషన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 31 న పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్‌ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు