అమ్మ కుర్చీలో కూర్చొన్నావు.. ఎక్కువ కాలం సీఎంగా ఉండలేవు : పళనికి రాధాకృష్ణన్ హెచ్చరిక

మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:34 IST)
దివంగత జయలలిత కూర్చొన్న కుర్చీలో కూర్చొన్నావు.. ఇకపై ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేవు అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. పళనిస్వామి కూర్చొన్న కుర్చీ అద్దె కుర్చి. అందులో ఎక్కువ కాలం ఉండలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి సోమవారం సచివాలయానికి వెళ్లి జయలలిత వినియోగించిన కుర్చీలో కూర్చొన్నారు. దీనిపై పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. 'స్వంత ఇంట్లో మన కుర్చీలో కూర్చోవడం, అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ' పళనిస్వామిపై ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
 
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి 'అద్దె కుర్చీ'లో ఉన్నారని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గు చేటన్నారు. విపక్షాలు లేకుండానే స్పీకర్ ధనపాల్ బలపరీక్ష నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

వెబ్దునియా పై చదవండి