మహిళలు ప్యాంట్, షర్ట్ ధరిస్తే ఆ రోగాలు తప్పవ్.. క్యాంటీన్లో తాడు కట్టేస్తే బెస్ట్..

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:17 IST)
పురుషుల మాదిరిగా దుస్తులు ధరించే బాలికలు పురుషుల్లాలాగానే ప్రవర్తించడం మొదలెడతారని.. వారి మనస్సుల్లో ఆలోచనలు వ్యతిరేక దిశలో ఉంటాయని  ముంబై, బాంద్రా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ స్వాతి దేశ్‌పాండే హెచ్చరించారు. మహిళలు ప్యాంట్, షర్టు ధరిస్తే పాలిసిస్టిక్ ఒవేరియన్ సంక్రమిస్తుందని ఆమె హెచ్చరించారు. దీనివల్ల పునరుత్పాదనకోసం సహజమైన ఆకాంక్ష చిన్న వయసులోనే క్షీణిస్తుందన్నారు. స్త్రీ సంబంధ రోగాలకు ఇదే కారణమని తెలిపారు.
 
కాలేజీ అధికారులు కూడా విద్యార్థినులకు తగిన యూనిఫామ్ కోసం పరిశీలన జరుపుతున్నారని.. సల్వార్ కమీజ్ అయితే విద్యార్థినులను మానసిక, హార్మోనుల సంబంధిత అసమతుల్యత నుంచి కాపాడవచ్చునని స్వాతి దేశ్‌పాండే తెలిపారు. క్యాంటీన్లో తాడు కట్టి ఓవైపు విద్యార్థులు, మరోవైపు విద్యార్థినులు ఉండేలా చర్యలు తీసుకోవాలని.. అప్పుడే క్యాంపస్‌లో లైందిక వేధింపులకు స్వస్తి పలకగలమని స్వాతి దేశ్ పాండే అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి