దానిపై జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సంతకం చేశారు. అలాగే ఆరోజున మహాత్మాగాంధీ ఏ చెట్టు కింద కూర్చొని సంతకం చేశారో.. ఆ చెట్టు ఇప్పటికీ జైలు ప్రాంగణంలో అలాగే ఉంది. గాంధీజీ, బాలగంగాధర్‌తిలక్ శిక్ష అనుభవించిన జైలు వార్డులు కూడా నాటి స్వాతంత్య్ర సమరానికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.
పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభారు పటేల్ కూడా అరెస్టయి ఈ జైలులోనే శిక్షననుభవించారు. చాపేకర్ సోదరుల ఉరితీత ఇక్కడే. అంతేకాదు.. 2008, ముంబయి అల్లర్లకు పాల్పడిన ఉగ్రవాది కసబ్‌ను ఈ జైలులోనే ఉరితీశారు.