ఠాణాలో దర్జాగా డ్రగ్ సేవిస్తున్న నూతన వధువు.. ఎక్కడ? (వీడియో)

ఆదివారం, 8 జులై 2018 (16:22 IST)
మోచేతుల వరకు పెళ్లిగాజులు ధరించి.. పోలీసు స్టేషన్‌లో ఇనుప పెట్టెపై ఠీవీగా కూర్చొని దర్జాగా డ్రగ్ సేవిస్తుందో నూతన వధువు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేసమయంలో పోలీస్ స్టేషన్‌లో ఓ వధువు డ్రగ్ సేవిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
 
పెళ్లి గాజులు ధరించిన కొత్త పెళ్లికూతురు 'చిట్టా' (హెరాయిన్, ఎల్ఎస్డీ (లైసర్జిక్ యాసిడ్ డైథెలమైడ్, మెటామఫిటమైన్ తదితరాల మిశ్రమాన్ని పంజాబ్ ప్రాంతంలో 'చిట్టా'గా పిలుస్తారు) తీసుకుంటోంది. టేబుల్‌పై కూర్చొని ఓ కొవ్వొత్తి వెలిగించిన ఓ యువతి, ఫాయిల్ పేపర్‌పై చిట్టా వేసి దానికి కొవ్వొత్తి వేడిని చూపించి, పీల్చుతూ మత్తులోకి వెళుతోంది. 
 
ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి, తాను జలంధర్‌లో రైడ్‌కు వెళుతున్నట్టు చెప్పిన గొంతు వినిపిస్తోంది. ఆమె ఓ బలమైన ఇనుప పెట్టెపై కూర్చుని ఉండగా, అటువంటి బాక్స్‌లు పోలీసు స్టేషన్లలోనే సహజంగా కనిపిస్తుంటాయి. వాటిల్లో ఆయుధాలను దాచుతుంటారు. ఇటీవల ఫిరోజ్‌పూర్ డీఎస్పీ, బలవంతంగా ఓ యువతికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ కాగా, పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ మొత్తం ఎపిసోడ్‌లోనూ పోలీసుల పాత్రపై విమర్శలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు