పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా నిజాంపూర్ గ్రామంలో ఓ గురుద్వారాలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, సిక్కుల పవిత్ర జెండా నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేస్తూ కొందరు సిక్కుల కంటపడ్డారు. ఇంతలో అక్కడకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కానీ, ఆ వ్యక్తిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై గ్రామస్థులు దాడి చేయడంతో ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అమృతసర్‌లో ఓ ఘటన జరిగిన 24 గంటల్లోనే పంజాబ్‌లో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం.