కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని, ర్యాలీని రద్దు చేసుకున్నారు. వైద్యుల సలహా మేరకు రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున రాహుల్ ప్రచారం చేస్తున్నారు.
అయితే, శుక్రవారం మాత్రం యధావిధిగా రాహుల్ ఎన్నికల ప్రచారం సాగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాగా, భారత గణతంత్ర వేడుకల తర్వాత ఈ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరంకానుంది.