కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన దారిలో రామ్ చేత్ అనే చెప్పులు కుట్టే వ్యక్తివద్ద ఆగారు. ఆయనతో మాట్లాడారు. అంతేగాకుండా రాహుల్ గాంధీ బృందం శనివారం రామ్ చేత్‌కు కుట్టు యంత్రం అందించింది. దీంతో రామ్ చేత్ సంతోషానికి అవధుల్లేవ్. రాహుల్ సాయంపై ఆనందంతో ఉన్న చైత్.. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు జతల షూలను పంపాడు.
చెప్పులు కుట్టే పనిని ఈ మిషన్ పని సులువు చేస్తుందని తమ నేతను చూసి గర్విస్తున్నామని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ చెప్పారు. "రాహుల్ గాంధీ ప్రజల మనిషి అని ఈ సంఘటన తెలియజేస్తుంది. ప్రజా సేవలో ఆయన అంకిత భావం ప్రస్ఫుటమవుతోంది" అని కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.