చైనీస్ ఫుడ్‍ను బ్యాన్ చేయండి.. అథవాలే డిమాండ్

గురువారం, 18 జూన్ 2020 (15:09 IST)
కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చైనా ఫుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనీస్ ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలనీ రాందాస్ అథవాలే డిమాండ్ చేసారు. అలాగే ప్రజలు చైనీస్ ఫుడ్‌ని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. గతంలో ఈయనే కరోనా వైరస్ విషయంలో "గో కరోనా గో " అంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీస్ ఆహారంపై నిషేధం విధించాలని ఆయన పట్టుబట్టారు. 
 
భారత్‌- చైనా సరిహద్దులో గాల్వాన్‌ లోయ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతుతూ.. '' చైనా 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. భారత్‌ను అవమానించే చర్యలకు దిగింది. చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని నా సూచన. చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు కూడా వాటిని మూసివేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలివ్వాలి. చైనా ఆహార ఉత్పత్తులను తినేవారు కూడా వాటిని బహిష్కరించాలని నా వినతి'' అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు