పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం కోరితే అన్నిరకాల సహాయాలు అందించడానికిళ భారత్ సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులోని నేషనల్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ కనుక కోరుకుంటే అన్ని రకాలుగా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
యురీ ఉగ్రదాడి, ఆ తర్వాత పీవోకేలో జరిగిన మెరుపు దాడులు, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నైజం ప్రపంచ దేశాలకు తెలిసిందని, అందుకే ఆయా దేశాలు పాక్‌ను దూరం పెడుతున్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని రాజ్‌నాథ్ అన్నారు.